ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకి జగన్ పడుతుంటే టీడీపీ నేతలకి గుండెల్లో రైళ్ళు పడుగెడుతున్నాయి. కడప నుండి కర్నూలుకి చేరిన జగన్ పాదయాత్ర చంద్రబాబు సర్కార్ తుక్కు రేగ్గొడుతున్నాడు. దీంతో చంద్రబాబు సర్కార్ జగన్ పాదయాత్ర పై నిఘా పెంచిదని ఆంగ్ల పత్రికలు కూడా పేర్కొన్నాయి. ఇక మరోవైపు జగన్ పాదయాత్రకి కిక్కిరిసిన జనం రావడంతో.. చంద్రబాబు సర్కార్ అందుకు కారణాలు వెదికే పనిలో పడింది. అందులో భాగంగానే ఏపీలో ఒక సర్వే చేయించింది. ఆ సర్వే రిపోర్ట్‌లో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయట. అసలు విషయం ఏంటంటే ఏపీ విడిపోయాక చంద్రబాబు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే విడిపోయి కష్టాల్లో ఉన్న ఏపీని అనుభవఘ్నుడైన చంద్రబాబు అభివృద్ది పదంలోకి తీసుకెళతాడని అధికారాన్ని కట్టబెడితే… ఆర్ధికంగా వెనుకబడిన ఏపీలో కనీవినీ ఎరుగని రీతిలో దోచుకుంటున్నారట టీడీపీ నేతలు. దేశంలో ఉన్న అన్ని రకాల కుంభకోణాలు ఈ మూడున్నర ఏళ్ళలో ఒక్క ఏపీలో ఉన్న టీడీపీ నేతలు చేసారంటే.. టీడీపీ నేతలు ఎలా దోచుకుంటున్నారో అర్ధమైపోతుందది. ఒక వైపున డబ్బు లేదంటూనే, కొన్ని వేల కోట్లు రూపాయలు వృధా చేస్తూ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారట. అయితే ఇలాంటి విషయాలు మీడియాలో కూడా ఎక్కడ బయటకు పొక్కనివ్వరు. ఎందుకంటే ఏపీకి సంబందించి ఎక్కువగా టీడీపీ అనుకూల మీడియానే ఉంది కనుక.
చంద్రబాబు చేయంచిన సర్వేలో డైరెక్ట్‌గా సేకరించిన ప్రజాభిప్రాయాల్లో 84 శాతం ప్రజలు భూకబ్జాల పై ఫిర్యాదులు చేశారట. ఆ భూకబ్జాల్లో ఎక్కువశాతం టీడీపీ నేతల పాత్ర ప్రత్యక్షంగా ఉందని చెప్పెనట్టు సమాచారం. అంతే కాకుండా భవననిర్మాణ అనుమతుల విషయానికి వస్తే సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అంటే వందకి వంద శాతం మంది ఈ విషయంలో అవినీతి దారుణంగా ఉందని చెప్పారని తెలుస్తుంది. ఇసుక అక్రమ రవాణాలో 40 శాతం మంది నేతలు ఉన్నట్లు ప్రజా సర్వేలో తేలిందని.. ఇది చంద్రబాబు సర్కార్‌కి మాయని మచ్చ అని చెబుతున్నారు. ఇదంతా ప్రతిపక్షం చేసిన ఆరోపణలు కాదని.., స్వయంగా చంద్రబాబు సర్కార్ పనితీరుపై చేసుకున్న సర్వేగా తెలుస్తుంది. దీంతో ఏపీ ప్రజలకి చంద్రబాబు సర్కార్ పై పూర్తిగా వ్యతిరేకత వచ్చేసిందని.. అందుకే జగన్ పాదయాత్రకి జనం బ్రహ్మరథం పడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆ రిజల్ట్ కనిపిస్తుందని.. ఏదిఏమైనా చంద్రబాబు సర్కార్‌కి సొంత సర్వే దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.