సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణవాదుల చేతుల్లో దెబ్బలు తిని, విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేసి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి, నిమ్స్‌లో ఉరుకులు పరుగులతో బెడ్‌మీద చేరి, చివరకు….రాజకీయాలకు దూరం అంటూనే జోస్యాలు చెప్తూ టైం గడిపేస్తున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్…టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
ప్రగతి భవన్‌కు బుధవారం వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వాన పత్రిక అందజేశారు. తప్పకుండా రావాల్సిందిగా… లగడపాటి ప్రత్యేకంగా విన్నవించారని సమాచారం. కాగా, ఇటీవలే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లగడపాటి ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే.