వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర వంద కిలోమీటర్లకు చేరుకుంది. జగన్ చేపట్టిన పాదయాత్రకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక జగన్ ఒకవైపు పాదయాత్ర, మరోవైపు కూడళ్ళలో నిర్వహిస్తున్న మీటింగుల్లో జగన్ చెలరేగిపోతున్నారు. ఇక మంగళవారం బాలలదినోత్సవం సందర్భంగా జగన్ శుభాకాంక్షలు తెల్పుతూ పిల్లల చదువుకోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లల్ని తప్పకుండా స్కూళ్లకు పంపిస్తే చాలని.. వారి చదువుకు అయ్యే ఖర్యు తామే భరిస్తామని.. ప్రతి ఇంట్లో.. ఇద్దరు పిల్లలకు ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. పేదవాడు చదువుల కోసం ఇబ్బందులు పడకుండా చేస్తామని.. ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌లాంటి చదువులు మీ పిల్లలతో నేను చదివిస్తానని హామీ ఇస్తున్నాను.
ప్రస్తుత పరిస్థితుల్లో పేద పిల్లవాడు ఉన్నత చదువులు చదివే పరిస్థితులు లేవని.. ఇంజనీరింగ్ ఫీజులు చూస్తే లక్షల్లో ఉంటే.. ప్రభుత్వం మాత్రం కేవలం రూ. 35 వేలు ఇస్తోదని.. మిగిలిన డబ్బులు తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఈ పరిస్థితి మారాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని.. మేము అధికారంలోకి వస్తే చేసే మొదటి పని వైఎస్ యుగాన్ని తెస్తామని స్పష్టం చేశారు. ఏ పేదవాడు చదువుల కోసం ఇబ్బందులు పడకుండా చేస్తామని.. ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌లాంటి చదువులు మీ పిల్లలతో నేను చదివిస్తానని సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్.