ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ.. జగన్ పాదయాత్రకి ప్రజల్లో స్పందన రాదని ఊహించారు. అయితే టీడీపీ బ్యాచ్ ఊహల్ని తలక్రిందులు చేస్తూ వేల సంఖ్యలో ఇసుక వేస్తే రాలనంత జనం జగన్ కోసం తరలి రావడంతో టీడీపీ నేతల గుండెల్లే రైళ్ళు పరిగెడుతున్నాయి. దీంతో వెంటనే చంద్రబాబు బ్యాచ్ తమ పచ్చ బుద్దికి పని చెబుతూ.. జగన్ పాదయాత్ర పై నిఘాను మరింత పెంచింది.
జగన్ పాదయాత్ర మొదలు అయిన మొదటి రోజు నుండి టీడీపీ అనుకూల మీడియా జగన్ పై బురదజల్లుతూ ఎంత విష ప్రచారం చేసినా.. రోజు రోజుకూ జనం వేల్లో తరలి రావడంతో రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్య పోతున్నాయి. ఇక జగన్ పాదయాత్రలో నిర్వహిస్తున్న సభలు అయితే బహిరంగసభలను తలపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సర్కార్ ఓ స్కెచ్ వేసి జగన్ పాదయాత్ర పై పూర్తిగా కన్నేసి ఉంచేందుకు అత్యాథునిక పరికరాలను వాడుతున్నారు.
పాదయాత్ర మూడవరోజు గమనిస్తే పోలీసుల చొక్కాలకు వేలాడుతున్న కెమెరాలు కనిపించాయి. జగన్ పాద యాత్రకు ఏయే వర్గాల ప్రజలు వస్తున్నారు.. ఎవరెవరు జగన్‌ను కలుస్తున్నారు.. తదితర వివరాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను నేరుగా చూసేందుకు ప్రభుత్వం పోలీసుల ఖాకీ చొక్కాలకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. కెమెరాలను తగిలించుకున్న పోలీసులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వచ్చే జనాన్ని చిత్రీకరిస్తున్నారు. టీడీపీ నాయకులు ఎవరైనా వైఎస్ జగన్‌ను కలుస్తున్నారా.. అనే విషయం తెలుసుకునేందుకు ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు టీడీపీ సీనియర్ నాయకుడు తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. దీంతో జగన్ పాదయాత్ర దెబ్బకి టీడీపీ బ్యాచ్‌కి తడిసిపోతుందని అందుకే నిఘా పెంచిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.