ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర ఎనిదవరోజున జగన్ కర్నూలులో అడుగు పెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కర్నూలు జిల్లాలోని నేతలు టీడీపీ లోకి దూకారు. దీంతో కర్నూలులో జగన్ పాదయాత్రను వైసీపీ సీరియస్‌గా తీసుకుంది. జగన్ పాదయాత్రని ఎట్టి పరిస్థితిలో అయినా సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి నేపద్యంలో జగన్ పాదయాత్రలో భాగంగా కర్నూలులో అడుగు పెట్టడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలులో 11 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాలను వైసీపీ గెలుచుకొని దూసుకుపోగా.. టీడీపీ మాత్రం డీలా పడిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు స్వల్ప తేడాతో టీడీపీ అధికారంలోకి రావడంతో కొందరు వైసీపీ నేతలు టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో ప్రజలు వైసీపీ పై నమ్మకం ఉంచి గెలిపిస్తే వారు ప్రజాభిప్రాయానికి విరుద్థంగా పార్టీ మారిన విషయాన్ని తన పాదయాత్ర జగన్ ఎండగట్టనున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి మారి మంత్రి అయిన భూమా అఖిలప్రియ సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డ నుంచే జగన్ ఈపాదయాత్ర కర్నూలు జిల్లాలో ప్రవేశించింది.
ఇక ఇప్పటికే జగన్ పాదయాత్రకు కిక్కిరిసిన జనాలు రావడంతో వైసీపీ నుండి ఫిరాయించిన బ్యాచ్‌కు దిక్కుతోచడంలేదు. జగన్ పాదయాత్రను లైట్ తీసుకున్నారని టీడీపీ బ్యాచ్ పైకి చెబుతున్నా.. జగన్ యాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి సదరు నియోజకవర్గాలలో పెండింగులో ఉన్న పనులు కంప్లీట్ చేయాలని చంద్రబాబు వద్దకు వెళ్ళి మోర పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు నీతిలేని నాయకులు మాత్రమే టీడీపీలో చేరారని.. ప్రజలంతా వైసీపీతోనే ఉన్నారని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. ఇక మరోవైపు కర్నూల్ పాదయాత్ర ఎందవరకు విజయవంతం అవుతుందో అని చంద్రబాబు సర్కార్ కన్నేసింది. ఎందుకంటే రాజకీయ నిపుణులు కూడా ఊహించని రీతిలో జగన్ అడుగులు వేయడం.. జనం కూడా జగన్ కోసం వేలమందిలో తలరి రావడం చూస్తుంటే టీడీపీ బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని సర్వత్రా చర్చించుకుంటున్నాయి.