తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నేతలపై ఇప్పటికే పలువురు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరల సొంత గూటికి చేరనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సరైన గౌరవం దక్కడంలేదు .తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని అందుకే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అని ఆ వార్తల సారాంశం .
.తనపై వస్తున్న వార్తలపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లో వార్డు మెంబర్ స్థాయి నుండి ఎంపీ స్థాయిగా ఎదిగాను .ఒక మాములు కార్యకర్తగా నా రాజకీయ జీవితం ప్రారంభమై నేడు ఇంతటి సీనియర్ నేతగా పేరు సంపాదించుకున్నాను .నాకు తాబేలు మాదిరిగా నా లక్ష్యం వైపు వెళ్ళుతున్నాను .భారత మాజీ ప్రధానమంత్రులు దివంగత ఇందిరాగాంధీ ,రాజీవ్ గాంధీ ,అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ లు చనిపోయిన కానీ వారు గుర్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళు చేసిన మంచి పనులే .
అట్నే నేను కూడా నన్ను నమ్ముకున్న వారికి ఏదో చేయాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నాను .అలాంటి సమయంలో తనపై ఇలాంటి వార్తలు రావడం సహజం ..నాకు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఏమి అసంతృప్తి లేదు .నేను అడిగిన ప్రతిపనిని తమ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్నారు .జిల్లా అభివృధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు .అలాంటప్పుడు నేను ఎందుకు పార్టీ మారతాను అని ఆయన అన్నారు .