శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్ళే అయ్యప్ప భక్తులకు కేరళ దేవాదాయ శాఖా మంత్రి సుందరన్ శుభవార్త ప్రకటించారు .ఈ ఏడాది నుండి శబరిమలలో ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు మంత్రి సుందరన్ వెల్లడించారు. ఏటా ఆలయానికి అయ్యప్ప భక్తుల తాకిడి ఎక్కువ అయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ …ఈ ఏడాది తొలిసారిగా శబరిమలలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని కేరళ ప్రభుత్వం మొదలుపెట్టినున్నది. ఈ నిత్యాన్నదానంలో రోజుకు 5 వేల మంది భక్తులకు భోజనం ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమం 14 జనవరి 2018 మకర విళక్కు( మకర జ్యోతి ) వరకు కొనసాగిస్తాం. అని అన్నారు . తొలి మండల పూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయ్యప్ప ఆలయాన్ని నవంబరు 15 న తెరవనున్నారు. మహిళా భక్తుల కోసం పంపానది నుండి ప్రత్యేక క్యూలైనును ఏర్పాటు చేస్తారు. బుధవారం ప్రత్యేక పూజలు చేసి గురువారం నుండి సాధారణ సమయాల్లో భక్తులను గుళ్ళోకి అనుమతించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023