ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ నేత కన్నా లక్ష్మీ నారాయణ త్వరలోనే వైసీపీలో చేరతారు అని వార్తలు వస్తున్నాయి .
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఆయన గత కొంత కాలంగా పార్టీ ప్రత్యేక్ష కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు .అంతే కాకుండా టీడీపీ సర్కారుపైన కూడా విమర్శలు చేయడం మానేశాడు . గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని హమీచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరించడం కూడా కన్నా పార్టీ మారడానికి ప్రధాన కారణాలలో ఒకటి అని అతని అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు .
ఒకవైపు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ కూడా టీడీపీ సర్కారుపై విరుచుకుపడటం ..మూడున్నరెండ్లుగా టీడీపీ సర్కారు ప్రజలను మభ్యపెట్టడం మినహా గత ఎన్నికల్లో ఒక్క హమీను కూడా నేరవేర్చకపోవడం కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి రాదని …మూడున్నరెండ్లుగా వైసీపీ చేస్తోన్న పోరాటాలు ..జగన్ ఉద్యమాల వలన వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుకోసం ..జగన్ కు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అంట .అందులో భాగంగా ఇప్పటికే కడప జిల్లాకు చెందిన జగన్ సన్నిహితుడుతో సమావేశం అయ్యారు అని కూడా టాక్ .అన్ని కుదిరితే త్వరలోనే కన్నా వైసీపీలో చేరడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి .