అండర్‌వరల్డ్ డాన్, కరుడుగట్టిన నేరస్తుడు దావూద్ ఇబ్రహింకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం వేలం వేసింది. ముంబైలో దావూద్ కు చెందిన మూడు భవనాలకు వేలం నిర్వహించారు. రూ. 11 కోట్లకు ఈ మూడు భవనాలను సైఫీ బుర్హానీ ట్రస్ట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేలం వేసిన భవనాల్లో ఒక రెస్టారెంట్ తో పాటు గెస్ట్ హౌస్ కూడా ఉంది.
ఉగ్రవాద నిరోధక చట్టం కింద మూడు దావూద్ కు చెందిన ఆస్తులను కేంద్రం సీజ్ చేసింది. వాటిని గతంలో కూడా వేలం వేసినప్పటికీ పెద్దగా స్పందన రాలేదు. కొద్ది రోజుల ముందు దావూద్ కు చెందిన ఓ కారును వేలం వేశారు. వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి అనంతరం దాన్ని తగులబెట్టారు. గతంలో ఇలా దావూద్ కారును కొని తగులబెట్టిన చక్రపాణి అనే వ్యక్తి దావూద్ రెస్టారెంట్ కొని, దాన్ని టాయిలెట్ గా మార్చాలనుకొని వేలంలో పాల్గొన్నారు. అయితే ఆక్షన్ లో దాన్ని సైఫీ బుర్హానీ ట్రస్ట్ దక్కించుకుంది.
ఇదిలాఉండగా….కాగా దావూద్ ఇబ్రహీం ఆస్తుల గురించి కొద్దికాలం క్రితం సంచలన వార్త తెరమీదకు వచ్చింది. అక్షరాల 43,000 కోట్ల రూపాయలు. దావుద్ ఇబ్రహీం ఆస్తులు ఉన్నాయని బ్రిటన్‌కు చెందిన మిర్రర్ పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన దావూద్ ఆస్తులు సుమారు రూ.43 వేల కోట్లు ఉంటాయని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఒకరకంగా డాన్ దావూద్ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న క్రిమినల్‌గా రికార్డు సృష్టించాడు. కొలంబియాకు చెందిన డ్రగ్ వ్యాపారి పాబ్లో ఎస్కోబార్ తర్వాత దావూద్ నిలుస్తాడని ఆ పత్రిక పేర్కొంది.
Tags bhai Dawood Bhai Dawood Ibrahim hotel restarent mumbai