మీరు విన్నది నిజమే .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండనున్నారు .అయితే అది ఇప్పుడు కాదు అంట వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది .అప్పుడు ప్రస్తుత టీపీపీసీ అధ్యక్షుడుగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు జోష్యం చెప్పారు .
నిన్న మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలంపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది .అప్పుడు టీపీపీసీ అధ్యక్షుడుగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తారు అని ఆయన అన్నారు .