అల్లరి చిత్రంతో తెలుగు సినీ ఇండస్ర్టీకి పరిచయమైంది నటి అపూర్వ. అయితే, ఎక్కువగా శృంగార పాత్రలనే ఈమె పోషిస్తుండటం గమనార్హం. ఆమె సినీ ఇండస్ర్టీలో కెరియర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలను ఎదుర్కొందట. అంతేకాదు. కొన్ని.. కొన్ని సంఘటనలతో మంచి మంచి అవకాశాలను కూడా వదులుకుందట. ఈ విషయాలన్నింటిని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నటి అపూర్వ.
తాను అల్లరి చిత్రం తరువాత మరో మూవీ చేస్తున్న సమయంలో ఓ ప్రొడ్యూసర్ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని ప్రొడ్యూసర్ గారు ఎక్కువగా అడుగుతున్నారు.. అంటూ మాటలు ప్రారంభించి తరువాత అసలు మేటర్‌ను చెప్పాడు. సినిమా ఇండస్ర్టీలో ఇదంతా కామన్ అంటూ నన్ను కన్విన్స్ చేయడానికి కూడా ప్రయత్నించాడు. సినిమాల్లో మంచి మంచి ఛాన్సులు రావాలంటే మనం సర్దుకు పోవాలి అంటూ నాకు నీతులు కూడా బోధించాడు అంటూ చెప్పుకొచ్చింది నటి అపూర్వ.
అందుకు నేను ఒప్పుకోకపోవడంతో కోపంతో ఒక మాట అనేసి వెళ్లిపోయాడని, ఆయన వెళ్లే క్రమంలో బొంగులో వెధవ బిల్డప్పు… తాటి చెట్టుకింద కూర్చొని పాలు తాగినా.. కల్లు తాగుతున్నారని అనుకుంటారు బయటి జనం అంటూ ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ప్రెస్టేషన్‌తో అన్నాడని తెలిపింది. అదే సమయంలో తనపై చేయి చేసుకునేందుకు కూడా ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది. ఇంకా.. డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ.. ఇండస్ర్టీలో వచ్చాక మిమ్మల్ని అదే అనుకుంటారు. నీవు ఏం చేయకపోయినా.. మీరు అలాంటి వారేనని బయట ముద్ర పడిపోతుందన్నారు. ఆయన అడిగిన దానికి నేను ససేమీరా అనడంతో అతను నా రూమ్ నుంచి వెళ్లిపోయాడు. అయితే, నేను తాగుతున్నది పాలో.. కల్లో అన్న క్లారిఫికేషన్ నాకు, మా ఫ్యామిలీకి తెలుసు. అలాంటప్పుడు ఇతరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా అంటూ నా మనసును నేనే కుదుటపర్చుకున్నానని చెప్పుకొచ్చింది నటి అపూర్వ.