కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి తీరుపై బీజేసీ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంగా.. జానారెడ్డి అడ్డుకున్నారు. బాలల దినోత్సవ సందర్భంగా.. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రు జయంతిపై చర్చ చేపట్టాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.ఈ నేపధ్యంలో బీజేపీ సభ్యులు లక్ష్మణ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై లక్ష్మణ్ కోపం చేశారు. నిరుద్యోగ సమస్యపై చర్చ జరగడం మీకిష్టం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఇటీవలే మీరు వాయిదా తీర్మానం ఇచ్చి.. ఇప్పుడు దానిపై చర్చ జరుగుతుంటే.. అడ్డుకోవడం ఏంటని లక్ష్మణ్.. జానారెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.