Home / NATIONAL / పొరుగు రాష్ట్రంలో చోరిఃబ్యాంక్ వ‌ర‌కు సొరంగం..కోటిన్న‌ర ఖ‌ల్లాస్‌

పొరుగు రాష్ట్రంలో చోరిఃబ్యాంక్ వ‌ర‌కు సొరంగం..కోటిన్న‌ర ఖ‌ల్లాస్‌

తెలివిమీరిపోయి..ప‌క్కా ప్లానింగ్‌తో చోరీకి పాల్ప‌డిన దొంగ‌ల క‌థ ఇది. చోరీ అంటే సాదాసీదాగా కాకుండా ఏకంగా సొరంగం త‌వ్వి మ‌రీ చేసిన చోరీ గాథ ఇది. బ్యాంక్ లాక‌ర్ వ‌ర‌కు సొరంగం త‌వ్వేసి చోరీకి పాల్ప‌డ్డారు. నవీ ముంబైలో ఓ దొంగల ముఠా బ్యాంకుకు కన్నం వేసింది. మూడు మ‌డిగెల‌ కింది నుంచి సుమారు 40 ఫీట్ల పొడవు, మూడు ఫీట్ల వెడల్పుతో ఏకంగా బ్యాంకు లాకర్‌ గది వరకు సొరంగం తొవ్వింది. స్ట్రాంగ్‌రూంలోని 30 లాకర్లలో దాచిన రూ.1.5 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. ఇందుకు వారాంతపు సెలవులను ఉపయోగించుకుంది.
నవీముంబై జైనగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాశాఖలో సోమవారం భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. రెండురోజుల వరుస సెలవుల అనంతరం బ్యాంక్‌ మేనేజర్‌ స్ట్రాంగ్‌రూం గది తెరిచారు. లాకర్లు తెరుచుకొని ఉండటంతోపాటు గొయ్యి కనిపించడంతో దోపిడీ జరిగినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని చోరీ తీరును పరిశీలించారు. శుక్రవారం రాత్రి స్ట్రాంగ్‌రూంలోకి వచ్చిన దొంగలు గ్యాస్‌ కట్టర్ల ద్వారా లాకర్లను తెరిచి నగదు, ఆభరణాలు దోచుకెళ్లారని తెలిపారు. ముఠాకు బ్యాంకు గురించి బాగా తెలిసి ఉంటుందని పేర్కొన్నారు.
భవన సముదాయంలోని గ‌దిని కిరాయికి తీసుకొన్న దొంగలు రెండునెలల క్రితం నుంచి సొరంగం తవ్వారని, సుమారు  ఎనిమిది టన్నుల శిథిలాలను ఉదయం వేళ బయట వేసినా ఎవరూ అనుమానించలేదని పోలీసులు తెలిపారు. సొరంగం కూలకుండా దొంగలు ఫ్లై ఉడ్ షీట్లు పెట్టి సపోర్టుగా వెదురుబొంగలు పెట్టారని పేర్కొన్నారు. బ్యాంకులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ స్ట్రాంగ్‌రూంలో అవి లేకపోవడంతో నిందితుల ముఖాలు ఎక్కడా లభించలేదని వెల్లడించారు. సమీప ప్రాంతాల్లో రికార్డయిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు వారు వివరించారు. ఇది జార్ఖండ్‌ దొంగల ముఠా పనిగా అనుమానిస్తున్న పోలీసులు.. వారిని పట్టుకొనేందుకు ఆరు బృందాలను రంగంలోకి దించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat