Home / First time in tollywood / సంగీత సంచలనం అనిరుద్..

సంగీత సంచలనం అనిరుద్..

అతనో సంచలనం. ఒక ట్యూన్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంగీతాభిమానులను తన వైపు చూసేలా మార్చుకున్న గొప్ప ప్రతిభ అతని సొంతం. బాషాబేధం లేకుండా ఒక తమిళ ట్యూన్ నలుదిశలా మారుమ్రోగిపోయింది అంటే అది మామూలు విషయం కాదు. టాలీవుడ్ లో అజ్ఞాతవాసితో పరిచయమవుతూ పూర్తి ఆడియో విడుదల కాకుండానే కేవలం రెండు పాటలతో యూత్ ని తన బుట్టలో వేసుకున్న అనిరుద్ కోసం ఇప్పుడు అగ్ర తెలుగు నిర్మాతలు చెక్ లతో సహా క్యులో ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. మరి చిన్న వయసులోనే ఇంత టాలెంట్ సొంతం చేసుకున్న అనిరుద్ గురించి లోతుగా తెలుసుకుందాం.

అనిరుద్ తండ్రి రవి రాఘవేంద్ర మల్టీ టాలెంటెడ్ యాక్టర్. తల్లి లక్ష్మి రవిచందర్ క్లాసికల్ డాన్సర్. కళాకారుల కుటుంబంలో పుట్టిన అనిరుద్ చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరగడం సహజంగానే ఇతనిలో టాలెంట్ ని తట్టి లేపుతూ వచ్చింది. అనిరుద్ తాతయ్య కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా 1930ల నాటి కాలంలోనే ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్నారు. అనిరుద్ రజనీకాంత్ దంపతులకు మేనల్లుడు వరస అవుతాడు. అనిరుద్ చిన్నతనంలోనే స్కూల్ లో జింక్స్ అనే బ్యాండ్ నడిపేవాడు. పదేళ్ళ వయసు నుంచే మ్యూజిక్ కంపోజ్ చేయటం స్టార్ట్ చేసిన అనిరుద్ 21 వయసులో 3 మూవీతో ద్వారా పెద్ద బ్రేక్ తెచ్చుకున్నాడు.

లయోలా కాలేజీ లో డిగ్రీ చదువుతున్నప్పుడు అనిరుద్ షార్ట్ ఫిలిమ్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించేవాడు. ఇతని పని నచ్చిన రజని కూతురు ఐశ్వర్య ఫ్యూచర్ లో సినిమా అవకాశం ఇప్పిస్తానని ప్రామిస్ చేసింది. అందులో భాగంగానే తన భర్తతో తీసిన 3 సినిమాతో అనిరుద్ ని వెండితెరకు పరిచయం చేసింది. ఆ మూవీ మ్యూజిక్ కంపోజింగ్ జరుగుతూ ఉండగానే ‘వై థిస్ కొలవేరి’ పాట ఆన్ లైన్ లో లీక్ కావడం, వెంటనే అలెర్ట్ అయిన యూనిట్ ఆ పాటను ధనుష్ పాడినట్టు ఒరిజినల్ గా రికార్డు చేసి వీడియో వదలటం, ఆసియాలోనే యు ట్యూబ్ ద్వారా అత్యధికులు చూసిన వీడియోగా అది సరికొత్త రికార్డులు సృష్టించడం చకచక జరిగిపోయాయి. దీనికే యు ట్యూబ్ మోస్ట్ పాపులర్ గోల్డ్ మెడల్, మోస్ట్ ట్రెండింగ్ సిల్వర్ మెడల్ బహుకరించి ఘనంగా గుర్తించింది.

నాదస్వరం, షెహనాయ్, సాక్సో ఫోన్, తావిల్ డ్రంస్, గిటార్, కీ బోర్డ్స్ ఇలా రకరకాల వాయిద్యాలు ఉపయోగించి అనిరుద్ చేసిన ఆ ప్రయోగానికి యువత వెర్రెత్తిపోయింది. ఇక అప్పటి నుంచి అనిరుద్ కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. ఇదంతా నవంబర్ 2011లో జరిగిన చరిత్ర. 3 మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా మ్యూజిక్ పరంగా చాలా ప్రత్యేక స్థానం తెచ్చుకుంది. దీని మ్యూజిక్ ద్వారానే అనిరుద్ ఫిలిం ఫేర్, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లాంటివి ఎన్నో గెలుచుకున్నాడు.

అనిరుద్ ప్రస్థానం అక్కడి నుంచి అజ్ఞాతవాసి దాకా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. 3 తర్వాత ఊపిరి సలపలేనంత అవకాశాలు చుట్టుముట్టడం మొదలు పెట్టాయి. డేవిడ్ సినిమా కోసం సింగల్ ట్రాక్ కంపోజ్ చేసిన అనిరుద్ అందులో అదే సూపర్ హిట్ గా నిలవడం అతని టాలెంట్ ని చూపుతుంది. తర్వాత ధనుష్ ఎతిర్ నీచల్, వణక్కం చెన్నై, విఐపి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ కి మర్చిపోలేని సంగీతం ఇచ్చాడు. ధృవ తో తెలుగుకు పరిచయమై ఇక్కడి వారిని కూడా మెప్పించిన హిప్ హాప్ తమిజాను కోలీవుడ్ కు పరిచయం చేసింది అనిరుదే. సెల్వ రాఘవన్ ఇరండం ఉలగం(వర్ణ)ఫ్లాప్ అయినప్పటికీ అనిరుద్ పనితనం మాత్రం గొప్పగా ప్రశంసించబడింది.

మాన్ కరాటే, విజయ్ కత్తి, కాకి సట్టయ్, నాన్ రౌడీ దాన్, మారి, వేదాలం, తంగమగన్(నవ మన్మధుడు), రెమో ఇలా ఒకదాన్ని మించి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ఎఆర్ రెహమాన్, హరీష్ జై రాజ్, యువన్ శంకర్ రాజ లాంటి దిగ్గజాలు ఏలుతున్న తమిళ సంగీత పరిశ్రమలో తనకంటూ బలమైన స్థానం ఏర్పరుచుకున్నాడు. విఐపి తెలుగు డబ్బింగ్ వెర్షన్ రఘువరన్ బిటెక్ ఆ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకోవడం మనవాళ్ళు ఇంకా మర్చిపోలేదు.

తెలుగులో అనిరుద్ ని తీసుకురావాలనే ప్రయత్నాలు చాలా గట్టిగా జరిగాయి. తమిళ్ లోనే గాలి పీల్చుకోలేనంత బిజీ గా ఉన్నా కూడా ఇక్కడ కూడా తన ముద్ర వేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న అనిరుద్ ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశం రావడం, అందులోనూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసే ఛాన్స్ కావడం ఇవి అనిరుద్ ని టాలీవుడ్ లో అడుగు పెట్టేలా చేసాయి. ఇప్పటి దాకా అజ్ఞాతవాసి లో రెండు పాటలు విడుదల అయ్యాయి. బయటికి వచ్చి చూస్తే టైం త్రీ ఓ క్లాక్, గాలి వాలుగా ఓ గులాబి వాలి అనే రెండు పాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంకా అసలైన ట్రాక్స్ రిలీజ్ కావాల్సి ఉంది. తన ఎంట్రీ మామూలుగా ఉండకూడదు అని డిసైడ్ అయిన అనిరుద్ పవన్ సినిమాకు అందుకు తగ్గ మ్యూజిక్ ఇస్తున్నట్టు అర్థమైపోయింది.

తనలోని యాక్టర్ ని కూడా పరిచయం చేస్తూ అనిరుద్ పవన్ కోసం చేసిన ట్రిబ్యూట్ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు అధిరోహించిన అనిరుద్ మనిషి చూడడానికి బక్కపలచగా అసలు తింటాడా లేదా అన్నట్టు ఉంటాడు కాని సంగీత సరస్వతి కొలువు తీరిన అతని మస్తిష్కాన్ని కొలవడం మాత్రం అసాధ్యమైన పనే. భవిష్యత్ ఆశాకిరణంగా మారిన అనిరుద్ రవిచందర్ ది సౌత్ ఇండియన్ ఫిలిం మ్యూజిక్ హిస్టరీలో చాలా ప్రత్యేకమైన పేజీ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat