తెలంగాణ రాష్ట్రంలో గోడౌన్ల నిర్మాణానికి రూ. 1,024 కోట్లు ఖర్చు చేసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గిడ్డంగుల నిల్వ సామర్థ్యం పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 14.67 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్‌లను పూర్తి చేశామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోప్రభుత్వ గోడౌన్‌లు ఖాళీగాపెట్టి ప్రయివేటు గోడౌన్లలో మెటీరియల్ పెట్టేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వ గోడౌన్లను అభివృద్ధి చేసి.. ప్రభుత్వ గోడౌన్లను నింపిన తర్వాతే.. ప్రయివేటు గోడౌన్లను నింపుతున్నామని పేర్కొన్నారు. .
