స్వచ్ఛ సర్వేక్షన్ 2018 ర్యాంకుల్లో తెలంగాణ పట్టణాలను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి కేటీ రామారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి స్వచ్చసర్వేక్షణ్ ర్యాంకుల్లో అగ్రస్థానం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇందుకోసం అన్ని మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లతో కలిపి ప్రత్యేకంగా అవగాహాన సదస్సు ఏర్పాటు చేయాన్నారు. ఈ సందర్భంగా అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షన్ 2018 సీడీని మంత్రి కేటీఆర్ ఈరోజు విడుదల చేశారు.
గత ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన హైదరాబాద్, వరంగల్, సూర్యాపేట వంటి పట్టణాలు మంచి స్థానాలను సంపాదించాయని మంత్రి కేటీఆర్ వివరించారు. అయితే ఈసారి స్వచ్చసర్వేక్షన్‌లో కొన్ని మార్పులు చేశారన్నారు. పారిశుద్ద్యం, హరితహారం, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా మార్చడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టండం ద్వారా తెలంగాణ పట్టణాల ర్యాకింగ్ మరింత పెరిగే అవకాశముందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా అకాడెమిక్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అధికారులు ఈ విషయంలో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.
Post Views: 483