Home / MOVIES / ప్లీజ్.. ఆ విష‌యంలో హ్యూమ‌న్ మైండ్‌ని యూజ్ చేయండి!.. అన‌సూయ‌

ప్లీజ్.. ఆ విష‌యంలో హ్యూమ‌న్ మైండ్‌ని యూజ్ చేయండి!.. అన‌సూయ‌

యాంక‌ర్ అనే ప‌దానికే అర్థం మార్చిన వారిలో అన‌సూయ ముందుంటారు. ఇందుకు కార‌ణం జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ ప్రారంభం కాక ముందు యాంక‌ర్లు ఒక ప‌రిధిలో.. మాట‌ల చ‌తుర‌త‌కే ప్రాధాన్య‌మిచ్చే వారు. అయితే, జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌తో ఎంట్రీ ఇచ్చిన అన‌సూయ త‌న అంద చందాల‌తో యాంక‌ర్ అనే ప‌దానికి మ‌రో అర్ధం చేర్చింది. దీంతో యువ‌త‌లో అన‌సూయ క్రేజ్ అమాంతం పెరిగింద‌న్న మాట వాస్త‌వ‌మేన‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు.

ప్ర‌స్తుతం యాంక‌ర్ అనుసూయ ఇటు బుల్లితెర‌తోపాటు.. అటు వెండితెర‌పైనా త‌న అభిమానుల‌ను అల‌రిస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్ పుణ్య‌మా అని యాంక‌ర్ అన‌సూయ క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్ల‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు అన‌సూయ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నార‌న‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. త‌న‌దైన న‌ట‌న‌తో.. బుల్లితెర‌పైనా, వెండితెర‌పైనా రెండిటిలోనూ క‌నిపిస్తూ అభిమానుల‌ను అల‌రించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది ఈ హాట్ యాంక‌ర్‌.

అయితే, తాజాగా అన‌సూయ ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానుల‌తో చాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో లోక్ ప్ర‌కాష్ ప్ర‌దీప్ నాయుడు పుషాదాపు అనే అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో జ‌వాబులు చెప్పింది అన‌సూయ‌. ఇంత‌కీ ఆ అభిమాని అడిగిన ప్ర‌శ్న ఏంట‌ని అనుకుంటున్నారా..? అన‌సూయ ప్లీజ్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్ మెయింటెన్ చెయ్ అంటూ స‌జీష‌న్ ఇచ్చాడు. దీనికి స్పందించిన అన‌సూయ లైవ్‌లో మాట్లాడుతూ.. నా బ‌ట్ట‌ల గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం నీకేంటి అంటూ ఫైర్ అయింది. వాట్ ఎగ్జాట్లీ ఇండియ‌న్ క‌ల్చ‌ర్.. మిస్ట‌ర్ లోక్ ప్ర‌కాష్ ప్ర‌దీప్ నాయుడు పుషాదాపు అని ప్ర‌శ్నించింది. అస‌లు ఇండియ‌న్ క‌ల్చ‌ర్ అంటే ఏంటో తెలుసుకోండి.. అప్పుడు అప్పుడు నేను ఫాలో చేస్తా అంటూ ఘాటుగా స‌మాధాన‌మిచ్చింది అన‌సూయ‌. ద‌య‌చేసి ఇప్ప‌టికైనా హ్యూమ‌న్ మైండ్ యూస్ చేయండి అంటూ ఆ అభిమానికి చుర‌క‌లంటించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat