ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి ఏడవ రోజుకు చేరుకుంది. అయితే జగన్ పాదయాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇక జగన్ పై విమర్శలు చేసిన వాళ్ళలో హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాల కృష్ణ కూడా ఉన్నారు.
బాలకృష్ణ కామెంట్స్ చేస్తూ.. జగన్ నువ్వొక కొండను ఢీ కొంటున్నావు జాగ్రత్త అంటూ సినిమా డైలాగ్ మాదిరి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే దీంతో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాలయ్యకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. నేనొక పిచ్చోడిని, నామానసిక పరిస్థితి అస్సలు బాలేదని దొంగనాటకాలు ఆడి ఒక కేసునుండి తప్పించుకొని దర్జాగా బయటతిరుగుతున్న నందమూరి బాలకృష్ణ.. జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి కానీ, అర్హత కానీ లేదని.. బాలయ్యకి తొడపాశం పెట్టినంతగా పంచ్ పేల్చారు ఎమ్మెల్యే అనిల్.
అంతటితో ఆగని అనిల్ యదవ్.. ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా.. ఏ సభకి వెళ్ళినా తనపై అభిమానంతో వచ్చిన వారి పై చెయ్యి చేసుకుని నిత్యం వార్తల్లోకి ఎక్కుతూ ఉంటాడు. దీంతో బాలయ్య ప్రోగ్రాంకి వెళ్ళాలంటేనే జనాలు భయపడిపోతున్నారని.. టీడీపీ ఏ పొలిటికల్ మీటింగ్‌కి వెళ్ళినా ఎవరినైనా కొట్టకుండా కొంపకి వెళ్ళాడా అని అనిల్ ప్రశ్నించారు. దివంగత నందమూరి తారకరామారావు లాంటి మహనీయుడికి పుట్టిన చీడపురుగు అని రాజకీయాల్లో ఇంకా అ..ఆ లు కూడా నేర్చుకోని బాలకృష్ణ జగన్ లాంటి వ్యక్తిని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు.