రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు పలు సంస్థల ద్వారా శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్నామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,992 మంది ఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. న్యాక్‌లో శిక్షణ పొందిన 27 మందిలో 24 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. 500 మందికి డ్రైవింగ్‌లో శిక్షణ కల్పించి.. ఉపాధి కల్పించామని తెలిపారు. ఎస్సీ అభ్యర్థులకు ఇచ్చే రుణాల విషయంలో ఎప్పటికప్పుడు బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు. నిరుద్యోగులకు సరైన శిక్షణ అందించి.. వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్న మంత్రి.. ఎస్సీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఉద్ఘాటించారు.
