ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఏడో రోజుకు చేరుకుంది. ఇవాళ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం నియోజకవర్గంలో కొనసాగనుంది. నియోజకవర్గంలోని దువ్వూరులో వైఎస్ జగన్ నేడు ఉదయం 9:30 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఎక్కుపల్లి, ఎన్నుపల్లి మీదుఆ ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో దారి పొడవునా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందకు సాగుతారు వైఎస్ జగన్. సంకల్ప యాత్ర 11 గంటలకు జిల్లెలకు చేరుకుంటుంది. అక్కడే మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.
తరువాత కనగుదురులో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు వైఎస్ జగన్. తరువాత జిల్లా బీసీ సంఘాల నాయకులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు దువ్వూరులోని ఇదమాదక వరకు సంకల్ప యాత్ర కొనసాగనుంది. రాత్రి వరకు పాదయాత్ర చేపట్టి చాగలమర్రి సమీపంలో రాత్రి బస చేయనున్నారు.
అయితే జగన్ చేస్తున్న ఈ పాదయాత్రకు ప్రజానీకం అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారు. అంతేకాదు, వారి వారి సమస్యలను జగన్ చెంతకు తెస్తున్నారు. వృద్ధులైతే తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులైతే తమకు ఇంత వరకు నిరుద్యోగ భృతి కల్పించలేదంటూ అలాగే మహిళలు, రైతులు తమకు రుణాలు అందడం లేదంటూ జగనన్న వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో జగనన్న వారిని ఓదార్చుతూ.. రానున్నది మన ప్రభుత్వమేనంటూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.