ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో నియంతలా వ్యవహరిస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నారని … తెలంగాణలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు ఎం. అంజన్‌కుమార్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.నగరంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం తగిన ప్రణాళికలను రూపొందిస్తామన్నారు.
