ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో నిన్న జరిగిన పడవ బోల్తా ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
Shocked to learn about the tragic boat accident in Krishna dist, A.P. Heartfelt condolences to the bereaved families?
— KTR (@KTRTRS) November 13, 2017
ఆదివారం సాయంత్రం 41 మంది పర్యాటకులు భవానీ ద్వీపం నుంచి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద ఉన్న పవిత్ర సంగమంలో హారతిని వీక్షించేందుకు బోటులో బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లో హారతిని వీక్షిస్తామనుకుంటుండగా బోటు తిరుగబడి ముగ్గురు చిన్నారులు, ఏడుగురు మహిళలు సహా మొత్తం 17 మంది మృత్యువాతపడ్డారు. బోటు డ్రైవరు కూడా మృతిచెందాడు. మరో 10 మంది గల్లంతయ్యారు. 15 మంది పర్యాటకులను స్థానిక మత్స్యకారులు రక్షించారు. రాత్రి 10.30 గంటలవరకు 16 మంది మృతదేహాలను వెలికితీయగా.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. చనిపోయినవారంతా ప్రకాశం జిల్లాకు చెందినవారే.