వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఎనిమిదో రోజు షెడ్యూల్ విడుదల అయింది. రేపు (మంగళవారం) ఉదయం నుంచి కర్నూల్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ముందుగా ఆయన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 8గం.30ని. ఛాగలమర్రి నుంచి పాదయాత్ర మొదలౌతుంది. ఉదయం 10గం.లకు ముత్యాలపాడు బస్టాండ్ కు చేరుకోగా.. అక్కడ ప్రజా సమావేశంలో వైఎస్ జగన్ నిర్వహిస్తారు. అనంతరం సెట్టివేడు మీదుగా గొడగనూర్‌కు యాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నాం 1 గంటకు జెండా ఆవిష్కరణ అనంతరం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4గం.30ని. ముత్యాలపాడుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి సాయంత్రం 6గంటల దాకా చక్రవర్తులపల్లి దాకా పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడే ఆయన రాత్రి బస చేయనున్నాడు .