కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 18 మందికి చేరిందని సమాచారం. ఫెర్రీ ఘాట్ వద్ద ఇంకా గాలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రమాదంలో మరణించిన వారి బందువులను పరామర్శించడానికి వెళ్ళిన రాజకీయ నాయకుల పై పోలీసులు చేసిన అత్యుత్సాహం వల్ల రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి.
అధికార టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం జారీ చేశారు. వైసీపీ నాయకులు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, జోగి రమేష్‌లు మృతుల కుటుంబాల వారిని పరామర్శించడానికి రాగా అక్కడే ఉన్న బుద్దా వెంకన్న పోలీసులకు వారిపై ఉసుగొలిపారు. అంతేకాకుండా పలు పార్టీలకు చెందిన నేతలు అక్కడికి చేరుకుంటుండగా సీపీ తోసేయమని ఆదేశించారు. టీడీపీ నేతలతో కలిసి పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల అక్కడ పరిస్థితిలు ఉద్రిక్తంగా మారాయి.
ప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధనేకుల మురళి, మ హిళా కాంగ్రెస్ నేత సుంకర పద్మశీ, మీసాల రాజేశ్వరరావు పరామర్శించటానికి రాగా అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు ఫూటుగా మద్యం తాగి పీసీసీ నాయకులకు అడ్డుపడ్డారు. దీంతో వీరి వెంటనే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అయితే సురక్షితంగా సాగాలిసిన విహార యాత్రలు విషాదకరంగా మారడం వెనుక అనేక కారణాలే ఉంటున్నాయి. ప్రభుత్వం గతంలో జరిగిన ప్రమాదాలను ఏ మాత్రం పరిగణలోనికి తీసుకోవడం లేదని… ఇది పూర్తిగా నేరపూరిత నిర్లక్ష్యమే అని రాజకీయ వర్గీయులు చర్చించుకుంటున్నారు.