ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తన అభిమానులు చేసే ఓవర్ యాక్షన్ గురించి అన్నీ తెలుసని,కావాలనే స్పందించడం లేదని సినీవిశ్లేషకుడు మహేశ్ కత్తి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌ని కొందరు దేవుడని అంటున్నారని, ఆయన దేవుడా? అని మహేశ్ కత్తి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఒకవేళ తన ఫ్యాన్సు చేష్టలపై స్పందిస్తే తాను పవన్‌కి దాసోహం అయిపోతానని వ్యాఖ్యానించారు. జనసేనాని రిప్లై ఇస్తే తాను ఆయన పార్టీలో చేరడానికి కూడా రెడీ అని మహేశ్ కత్తి సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ తనకు మద్దతుగా స్పందించాలని తాను అనడం లేదని, పవన్ ఎలా స్పందించినా తనకు సరేనని అన్నారు. తనకు పవన్ కల్యాణ్ స్పందన మాత్రమేకావాలని ఆయన నెగిటివ్‌గా స్పందిస్తాడా? పాజిటివ్‌గా స్పందిస్తాడా? అన్న విషయం తనకు అనవసరమని మహేశ్ కత్తి అన్నారు.అభిమానులు పవన్ కల్యాణ్‌ని దేవుడు అంటున్నారని, ఆయన ఎంతటి దేవుడో తానూ చూస్తానని మహేశ్ కత్తి సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ రాజకీయాలను ప్రక్షాళన చేస్తాడని కొందరు నమ్ముతున్నారని, పవన్ కల్యాణ్ తన అభిమానుల తీరుపై స్పందిస్తే తాను కూడా పవన్‌ని నమ్ముతానని ఆయన పార్టీ కోసం పనిచేస్తానని అన్నారు.
