ఏపీలో మరో భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న తరుణంలో తాజాగా తెలుగు తమ్ముళ్ళ భారీ స్కాం బయటపడింది .అందులో భాగంగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అగ్రిగోల్ద్ ను మించిన భారీ కుంభ కోణం ఇది .
అయితే ఈ భారీ కుంభ కోణంలో సాక్షాత్తు అధికార పార్టీ అయిన టీడీపీ సీనియర్ నేత ,మంత్రి అచ్చెన్నాయుడుకు అత్యంత ఆప్తుడు ,ఆ పార్టీ ఎంపీపీ కోళ్ళ అప్పలనాయుడు ,అతని అనుచరవర్గం అయిన వావిలపల్లి జగన్ ,అతని భార్య నాగవేణి ,శ్రీకాకుళం డీఈఓ ఆబోతుల ప్రభాకర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి . అయితే వీరి వెనక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు హస్తం కూడా ఉంది అని కూడా సమాచారం .అసలు విషయానికి వస్తే మోదుగుల పేట ,తాలాడ ,అప్పల అగ్రహారంలో గల నలబై ఎకరాల భూమిని తన స్కీమ్ లో వాటాదారు వావిలపల్లి జగదీశ్వరరావు కు టెక్కలి రిజిస్టార్ కార్యాలయంలో గత నెల ముప్పై తారీఖున నిందితుడు శ్రీరామ్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం .
అయితే నిత్యం నీతి వ్యాఖ్యలు చెప్పే మంత్రి అచ్చెం నాయుడు అనుచరుడు అయిన సదరు నేత మొత్తం 187 కొట్ల విలువ చేసే కుంభకొణంచేశారు అని సమాచారం . మంత్రి అచ్చెం నాయుడుకి ప్రధాన అనుచరుడు అయిన శ్రీరాం అనే యువకుడు,తెలుగుదేశం అధికారంలొకి రాగానే శ్రీకాకులం,రాజాం అనే చిన్న పట్టణంలొ ఇండి ట్రేడ్ అనే కంపెని ఏర్పాటు చేశాడు.దీంతో షేర్ మార్కెట్ సంస్థను ఏర్పాటు చేసి చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల నుండి ఒక్కొక్కొరి దగ్గర నుండి లక్ష రూపాయలు వసూళ్ళు చేశాడు.ఏకంగా రూ. 187 కోట్లు వసూళ్ళు చేసి….ఇప్పుడు బొర్డు తిప్పేశాడు.దీంతో బాధితుల పిర్యాదులు చేసిన కానీ పోలీసులు పట్టించుకొవటం లేదు అని వారు వాపోతున్నారు .