వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఆరో రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర అమృతనగర్‌కు చేరుకోగా. .అనంతరం అక్కడి చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.రుణాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని.. పిల్లలను చదవించుకోలేనపోతున్నామని చేనేత కార్మికులు జగన్ దగ్గర వాపోయారు. వారిని అన్ని విధాల ఆదుకుంటానని భరోసా ఇచ్చి ఆయన.. సత్వర పరిష్కార సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తేవాలంటూ స్థానిక నేతలకు వైఎస్ జగన్ సూచించారు. ఆపై మగ్గం యంత్రాన్ని ఆయన స్వయంగా కాసేపు నేశారు.
అనంతరం జగన్ మాట్లాడుతూ ..
పేదలకు ఉపయోగపడే పనులు ఒక్కటీ చేయకుండా.. కేవలం లంచాలు వచ్చే పనులను మాత్రమే చంద్రబాబు సర్కార్ చేస్తోందని వైఎస్ జగన్ అన్నారు . ఎక్కడికెళ్లినా తమకు పెన్షన్లు రాలేదని చెబుతున్నారని.. వైసీపీ అధికారంలోకి వస్తే అర్హులైనవారందరికీ పెన్షన్లు అందిస్తామని ఆయన ప్రకటించారు. పేదరికం పోవాలంటే అందరూ చదువుకోవాలని అన్నారు . స్కూల్‌కి వెళ్లే పిల్లకు నగదు సాయం అందిస్తాం అని తెలిపారు . ఉన్నత చదువులు చదువుకునే వారికి ఫీజు మొత్తం రీఎంబర్స్‌మెంట్ రూపంలో చెల్లిస్తాం అని హామీ ఇచ్చారు . ప్రత్యేక హోదా వస్తేనే పన్ను రాయితీలు వచ్చి.. ఉద్యోగాల కల్పన పెరుగుతుంది. వేల కోట్ల పెట్టుబడులు వస్తే అందరికీ ఉపాధి కలుగుతుంది. తద్వారా నిరోద్యోగ సమస్య లేకుండా పోతుంది.అందుకే ప్రత్యేక హోదా పోరాటానికి అంతా ముందుకు రావాలి అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.