ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చోటు సాధించిన ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీశారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నది ప్రజల సంకల్పమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.‘ జగన్‌లాంటి వారు రాజకీయాల్లో ఉండటం ప్రమాదకరం. ఆయనది ప్రజా సంకల్ప యాత్ర కాదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు చేపట్టిన యాత్ర. వైఎస్ కుటుంబం రాష్ట్రాన్ని అడ్డదారుల్లో దోచుకుంది. అప్పుడు దోచుకున్న ఆస్తులను రక్షించుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. అయితే మరో పక్క వైసీపీ అభిమానులు వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి ప్రజల బాట పట్టారు. ఇక పాదయాత్రకి విశేష స్పందన రావడంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి జగన్ పై బురదజల్లడానికి పూనుకున్నారు. అయితే జగన్ కూడా తన పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా వారికి షాక్ ఇస్తూ సవాల్ విసురుతున్నారు.
