వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి దళిత క్రైస్తవుల అభ్యర్థులను రేవం రెడ్డికి పోటీగా నిలబెడతామని, అతన్ని చిత్తుగా ఓడిస్తామని దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరుసలేం మత్తయ్య స్పష్టం చేశారు.ఓటుకు నోటు కేసులో తన స్వార్థ రాజకీయాల కోసం తమ జీవితాలను రేవంత్‌రెడ్డి పణంగా పెట్టాడని మత్తయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రైస్తవులకు టీడీపీ అండగా ఉందన్న ఉద్దేశ్యంతో నాడు ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి సహకరించామని, దాని ఫలితంగా ఆయా వర్గాలు ఎన్నో నిందలు, అవమానాలను ఎదుర్కొరన్నారు. అధికార దాహంతో కొందరు రెడ్లతో కలిసి రెడ్డి రాజ్య స్థాపనకు రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. కులపిచ్చి ఉన్న రేవంత్‌రెడ్డి నాడు అదే సామాజిక వర్గానికి చెందిన వేంనరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేసే ప్రయత్నంలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడన్నారు. అతని కుట్రలను ఆలస్యంగా గ్రహించామని అన్నారు . మేరకు రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నామని తెలిపారు.
