తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై విమర్శల పర్వం కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తా అని అన్నాడు .గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ పార్టీ మాటలతో ప్రజలను మభ్యపెడుతుంది అని ఆయన ఎద్దేవా చేశారు .రానున్న కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాను అని ఆయన అన్నారు .