తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు ,అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .నల్ల మనోహర్ రెడ్డి ఇప్పటికే పలు స్వచ్చంద కార్యక్రమాల్లో ,పలు సేవ కార్యక్రమాల్లో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటూ ఒక భరోసా కల్పిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఆదివారం జిల్లాలోని ఓదెల మండలంలో మడక గ్రామములో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని ఆయన సందర్శించారు .ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులకు ,ఇతర కార్యక్రమాల కోసం 10000 రూపాయలను విరాళంగా అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన పలు చర్యలను తీసుకునే విధంగా అధికారులను సంప్రదిస్తాను ..భవిష్యత్తులో ఆలయాన్ని అభివృద్ధి చేస్తాను హామిచ్చారు .ఈ కార్యక్రమములో మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ ,జూలపల్లి సింగిల్ విండో మర్కెట్ చైర్మన్ పాఠకుల అనిల్ ,ఎంపిటీసీ హనుమంత రావు ,రాంచెందర్ గౌడ్ ,రాజయ్య ,కుమార్,వీరాస్వామి ,శంకరయ్య ,పోశాలు ,కుమారస్వమి, సారంగపాణి , శ్రీనివాస గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Tags nalla manohar reddy