గత మూడు రోజుల క్రితం అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కాచిగూడ మహిళా సెక్షన్ అధికారిపై కాచిగూడ కార్పొరేటర్ చైతన్య భర్త ఎక్కాల కన్నా దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే . అంతేకాకుండా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడు.ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ పై దాడికి పాల్పడిన కాచిగూడ కార్పొరేటర్ చైతన్య భర్త ఎక్కాల కన్నాపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు . ఈ మేరకు శనివారం కన్నాను ప్రగతి భవన్‌కు పిలిపించిన కేటీఆర్ , టీఆర్ఎస్ పార్టీ నీ సొంతమనుకుంటున్నావా.. పార్టీ పేరు చెప్పుకొని దాడులకు పాల్పడతావా అంటూ మండిపడ్డట్లు సమాచారం.చేసింది చాలక.. సెక్షన్ ఆఫీసర్ పై పోలీస్‌స్టేషన్‌లో కేసు ఎందుకు పెట్టావు.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయొద్దని చెప్పినా ఎందుకు చేశావు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
