సూర్యపేట జిల్లా మిర్యాల గ్రామంలో ఓ వ్యక్తి మాంసం తింటూ ఒక్కసారిగా క్రింద కుప్పకూలాడు. ఆ తర్వాత ఊపిరాడక అతను చనిపోయాడు. మిర్యాల గ్రామంలోని రవీందర్(35) నాగోల్‌లోని ఓ భవనంలో వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మటన్‌తో భోజనం చేస్తున్నాడు.కానీ ఆదరా బాదరా తినడంతో పూలుగు బొక్క గొంతులో ఇరుక్కుంది. దీనితో కొద్దిసేపు రవీందర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. బొక్క గొంతులో ఇరకడంతో శ్వాస తీసుకోవడానికి వీలులేకుండా పోయింది. వెంటనే కుటుంబసభ్యులు కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు.