తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకుడు మధిరకు చెందిన పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్ శనివారం టీఆర్ఎస్లో చేరారు. కృష్ణాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు సమక్షంలో పుతంబాక టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 35యేళ్లుగా కృష్ణప్రసాద్ రాజకీయాల్లో ఉన్నారు .. ఆయన చేరికతో మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్కు మరింతగా బలం చేకూరుతుందన్నారు.పుతుంబాకతోపాటు మధిర నగర పంచాయతీ 16వ వార్డు కౌన్సిలర్ మునుగోటి నాగలక్ష్మీ ఆమె భర్త మునుగోటి వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెం మోహన్రా వు, పలువురు నాయకులు టీఆర్ ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
