వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ..ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ..టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ వైఎస్సార్ కడప జిల్లాలో ఆరు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు .
జగన్ పాదయాత్రలో భాగంగా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు .జగన్ పాదయాత్ర చేస్తున్న ప్రొద్దుటూరు నియోజక వర్గంలో యువత ముఖ్యంగా మహిళలు ,విద్యార్ధినిలు తమ సమస్యలపట్ల పోరాడటం చేయడానికి తెలుసుకోవడానికి వచ్చిన జగన్ ను చూసి ఆనందంతో సెల్ఫీలు దిగటానికి ఉత్సాహం చూపించారు .దీంతో జగన్ పాదయాత్రలో ఎంత అలిసిన కానీ వారిని చూసి ఆప్యాయంగా ప్రేమగా ఒక అన్నయ్యగా వారితో సెల్ఫి దిగటానికి ముందుకొచ్చారు .
అయితే ఇప్పటివరకు తమకు చేతులు ఇస్తున్న పట్టించుకోని ..సెల్ఫి దిగటానికి ప్రయత్నించిన వారి చెంపలు పగలగొట్టడం ..వాళ్ళ చేతుల్లో నుండి మొబైల్స్ లాక్కొని పగులగొట్టిన నాయకులను చూశాం కానీ ఆరు రోజులుగా పాదయాత్ర చేస్తూ ఎంతో నీరసంగా ఉన్న కానీ తనతో సెల్ఫి దిగటానికి వచ్చిన యువత పట్ల జగన్ చూపించిన ఆప్యాయతలు ,అనురాగాలను చూసినవారిని జగన్ కు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెల్సినవాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .