గరుడవేగతో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ పవర్ చూపించాడు. తాజాగా రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసిన ఈ చిత్రం ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో తెరకెక్కగా శ్రద్దాదాస్, పూజాకుమార్ ఇందుల కథానాయికలుగా నటించారు. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో ప్రదర్శితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరిపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ఓటమెరుగని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సైతం ఈ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారుడు. ఇక రీసెంట్‌గా ‘బాహుబలి’ సినిమాతో ఇండియన్ స్టార్‌గా మారిన బాహుబలి ప్రభాస్ తల్లి గరుడవేగ చిత్ర హీరోయిన్ పూజా కుమార్‌ని అభినందించారట.
కొన్ని ఎపిసోడ్స్‌లో హార్ట్‌ని టచ్ చేసేలా యాక్టింగ్ చేసిందని ప్రశంసలు కురిపించారట. ఫోన్ చేసి మరీ ఈ అమ్మడిని అభినందించడంతో ఆ ఆనందం తట్టుకోలేక ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది పూజా. అంతేకాకుండా ప్రభాస్ తల్లికి థ్యాంక్యూ ఆంటీ అంటూ ధన్యవాదాలు తెలిపింది.