వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఆరో రోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ని ఏపీటీఎఫ్ ప్రతినిధులు కలిశారు. సీపీఎస్ విధానం రద్దుకు హామీయిచ్చినందుకు జగన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్ విధానంపై ఉద్యోగుల ఆందోళనలకు మద్దతు ఇచ్చిన ఏకైక నేత వైఎస్ జగన్ అని వారు తెలిపారు. జగన్ హామీతో లక్షా 84 వేల సీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి ఊపిరి వచ్చిందని ఏపీటీఎఫ్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రైవేటు స్కూల్స్, జూనియర్ కాలేజీ అసోసియేషన్ ప్రతినిధులు కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించి ప్రైవేటు స్కూల్స్, కాలేజీలను నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని జగన్‌ను కోరారు.