వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు. జగన్ పాదయత్రకి జనం నుండి విశేష స్పందన వస్తోంది. ఒక వైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు తన పై వస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇక ఇప్పటి వరకు జగన్‌ను టీడీపీ నేతలే టార్గెట్ చేయగా తాజాగా ఓ పాస్టర్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు విషయం ఏంటంటే.. జగన్ పాదయత్నని ప్రారంబించడానికి ముందు తిరుమల వెంకటేశ్వర స్వామిని సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజగా జగన్ తిరుమల దర్శనాన్ని తప్పుపడుతూ తిరుపతికి చెందిన పాస్టర్ డేవిడ్ ఏకంగా వైఎస్ పై కూడా వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పాస్టర్ డేవిడ్ మాట్లాడుతూ వైఎస్ కుటుంబం మొదటి నుండి క్రిస్టియన్స్ అని.. అలాంటిది జగన్ రాజకీయ అవసరాల నిమిత్తం తిరుమలకు వెళ్ళి పాపం చేశాడని.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తిరుమలకు వెళ్ళారని.. దీంతో ఆగ్రహించిన జీసస్.. ఉగ్రరూపం దాల్చాడని.. దాని పర్యావసానంగా ఆయన విమాన ప్రమాదంలో దుర్మరణం పొందారని చెప్పి రాజకీయవర్గాల్లో కలకలం రేపారు. ఇక పాస్టర్ వ్యాఖ్యల పై వైసీపీ వర్గీయులు ఎలా స్పందిస్తారో అని రాజకీయ వర్గీయులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి.