ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి-2 సినిమా తరువాత అందాల అనుష్క చేస్తున్న సిపిమా భాగమతి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. అందులో అనుష్క ఆవేశపడే లుక్లో కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా మొత్తం హర్రర్గా ప్రేక్షకులు అనుకోవడం ప్రారంభించారు.
అంతేకాదు అనుష్క ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని దర్శకుడు అశోక్ ఖండించారు. భాగమతి సినిమాలో అనుష్క ద్విపాత్రాభినయం చేయడం లేదని, ఇది హర్రర్ సినిమా కూడా కాదని, ఈ సినిమా చూసిన తరువాత అనుష్కను మీరు బాగా మెచ్చుకుంటారని ఆ నటన చూసి మీరు తట్టుకోలేరు అని, ఆమె కెరీర్ లోనే ఇదొక మంచి సినిమాగా మిగిలిపోతుందని చెప్పాడు దర్శకుడు అశోక్.
