కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. జీఎస్టీపై స్పందిస్తూ.. ఇదో గందరగోళమైన పన్ను విధానమంటూ అభివర్ణించారు. అంతేకాదు ఇటీవల ప్యారడైజ్ పేపర్స్‌లో వెలుగు చూసిన ప్రతి ఒక్కరిపై విచారణ జరిపించాలని యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు.
ఇక అంతటితో ఆగకుండా వీరిని 15 రోజుల్లోగా విచారించాలని అన్నారు. ఈ పేపర్లలో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పేరు కూడా వెలుగు చూసింది. తన కుమారుడితో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జైషాను కూడా విచారించాలని ఆయన పేర్కొన్నారు. దీంతో దేశ రాజకీయ వర్గీయుల్లో పెద్ద దుమారమే చెలరేగింది.