రాష్ట్రంలో ని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని జహంగీర్‌పీర్ దర్గాలో శుక్రవారం న్యాజ్ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దర్గాలోని బాబాల సమాధుల వద్ద సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేసి, దట్టీల ను సమర్పిస్తారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా దర్గాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్గాలోకి సీఎం వెళ్లేందుకు ప్రత్యేక తాత్కాలిక దారి, దర్గా ఆవరణలో న్యాజ్ భోజనాలు చేసేందుకు షెడ్లను ఏర్పాటు చేశారు. దర్గా వద్ద ఏర్పాటు చేసిన వసతులను ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాశ్‌రెడ్డి గురువారం పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారిగా దర్గాను దర్శించుకోవడం ప్రత్యేకతను సంతరించుకున్నది.
