ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది .
రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పార్లమెంట్ కు పోటీ చేసే యోచనలో ఉన్నాను అని ఆయన ఒక ప్రముఖ వెబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు . అయితే ఇటీవల జేసీ టీడీపీకి రాజీనామా చేయడం ..ఆ తర్వాత టీడీపీ పార్టీ సమావేశాలకు ,అధికారక కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పవన్ వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు పవన్ ఇంటర్వ్యూ ఇచ్చిన తీరును చూసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .
అయితే వైసీపీ అధినేత జగన్ పవన్ ఎప్పటి నుండో మంచి మిత్రులు. ఈ స్నేహం ఇప్పటిది కాదు చిన్నప్పటినుంచే. అన్ని అనుకూలిస్తే పవన్ రెడ్డి వైసీపీ లోచేరి అనంత నుంచి ఎన్నికల బరి లో దిగవచ్చు.అయితే తానూ మళ్లీ పోటి చేసేంత ఓపిక తనకు లేదని ప్రకటించిన నేపథ్యంలో పవన్ అనంత నియోజకవర్గం పై పట్టు బిగించే యత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన జేసీ గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు. దీంతో ప్రస్తుతం పవన్ వైసీపీలో చేరి ఎంపీగా పోటి చేయవచ్చు అని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .