ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో,విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడిగా వాడుకునే అవకాశం ఉన్న కానీ కేవలం ఆ విషయం మీద భయపడి హైదరాబాద్ ను వదిలి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు.
అయితే వైసీపీ సభ్యులు సభకు గైర్హాజరు కావడంపై టీడీపీ నేతలు స్పందిస్తూ తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి, విమర్శించే అవకాశాలు లేవని భయపడిన జగన్, అసెంబ్లీని బహిష్కరించాడని చేసిన విమర్శలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా పై విధంగా మాట్లాడారు .
ఆమె ఇంకా మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనబోయి ఓటుకు కోట్లు కేసులో దొంగలా దొరికిపోయి, హైదరాబాద్ వదిలి అమరావతికి వచ్చి దొంగలా దాక్కున్న చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డంగా కొనుగోలు చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు . ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లారని స్పష్టం చేశారు. జగన్ ఉన్నప్పుడు అసెంబ్లీ పెట్టడానికే భయపడ్డారని ఆమె అన్నారు.