టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా విడుదల అయినా.. డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియాలో ఏ సినిమానైనా పొగిడాడంటే.. ఆసినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుందని ఆయా సినిమాల డైరెక్టర్స్, నటీనటులు గాలిలో తేలిపోతుంటారు. అయితే ఒకప్పుడు రాజమౌళి చేసిన ట్వీట్స్ చూసి సినిమాకెళ్లిన ప్రేక్షకుడు థియేటర్ నుండి తృప్తిగా బయటకి వచ్చేవాడు. అయితే ఇటీవల రాజమౌళి ఆయన సన్నిహితుల కోసం సినిమా విజయం సాధించినా సాధించకపోయినా కూడా సినిమా సూపర్ అంటూ ట్వీట్స్ చేసేసి నలుగురిలో నవ్వుల పాలవుతున్నాడు. అయినా కూడా రాజమౌళి చేసే ట్వీట్ కోసం ఎదురు చూసే అభిమానులు చాలామందే ఉన్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. రాజమౌళి గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్ పి ఎస్ వి గరుడవేగా సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవడంతో పి ఎస్ వి టీమ్ కి విషెస్ చెప్పడమే కాదు.. ఈ ఆదివారమే పి ఎస్ వి చూడడానికి టికెట్స్ బుక్ చేసుకున్నానని మరీ ట్వీట్ చేసాడు. అయితే రాజమౌళి ఆదివారం గరుడవేగ ని రాజమౌళి చూసాడా.. లేదా.. అనే దాని మీద ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. హాలీవుడ్ రేంజ్‌లో గరుడవేగ ఉందని సెలబ్రిటీస్ అందరూ గరుడవేగ చిత్రాన్నిఆకాశానికెత్తేస్తుంటే.. రాజమౌళి మాత్రం సినిమా చూసి కూడా కామ్‌గా ఉన్నాడు. అంటే ఈ సినిమా దర్శక ధీరుడికి నచ్చలేదా.. అనే డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు గాసిప్ రాయుళ్లు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే రాజమౌళి ఇలా గరుడవేగా విషయంలో స్పందిచకపోవడంపై పలు విమర్శలు వినబడుతున్నాయి. మరి ఈ విమర్శలకు ట్విట్టర్ సాక్షిగా రాజమౌళి క్లారిటీ ఇస్తాడో లేదంటే సైలెంట్‌గా ఉంటాడో వేచి చూడాల్సిందే.