విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన తెలంగాణ బిడ్డ, ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ సంస్థ రెడ్ బస్ కో ఫౌండర్ సామ ఫణీంద్రకు తెలంగాణ ప్రభుత్వం విశేష గుర్తింపు కల్పించింది. రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌గా సామ ఫణీంద్రను నియమించింది. ఈరోజు సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను ఆయనకు నియామక పత్రం అందించారు. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, గ్రామీణ ప్రాంతాలు సహా ప్రభుత్వపరంగా ఆవిష్కరణలకు అండగా నిలిచేందుకు ఈ సెల్‌ను ప్రభుత్వం నెలకొల్పింది. కో వర్కింగ్ స్పేస్, ఇంక్యుబేటర్ల సమన్వయం వంటివాటిని చేసుకునే అవకాశం ఈ సెల్ ద్వారా దక్కుతుంది. తద్వారా స్టార్టప్ కార్యక్రమాలు ఒకే చోట కేంద్రీకృతమై కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తమ సేవలు అందించేందుకు వీలు అవుతుంది.
రాబోయే తరం ఔత్సాహికులకు అండదండగా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ సెల్‌కు సీఈఓగా సామఫణీంద్రను నియమించింది. నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడు అయిన సామ ఫణీంధ్ర బిట్స్ ఫిలానీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఆయన పీజీ పట్టభద్రుడు అయ్యారు. భారతదేశంలో మొట్టమొదటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ వేదిక అయిన రెడ్‌బస్ సహ వ్యవస్థకుడుగా ప్రత్యేకతను సంతరించుకున్నారు. సీఈఓగా ఈ కంపెనీకి ఎనిమిదేండ్ల పాటు సేవలు అందించారు. దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్ సంస్థ రూ. 780 కోట్లకు ఈ సంస్థను కొనుగోలు చేసింది. ఈ కామర్స్ రంగంలో అత్యంత విజయవంతమైన బేరంగా ఈ లావాదేవీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఫణీంద్ర అనేక ప్రతిష్టాత్మక అవార్డులను పొందారు. ఐఎంఏఐ నుంచి ‘ఇండియా బెస్ట్ ఇంటర్నెట్ స్టార్టప్’ అవార్డును 2010లో పొందారు. ఈటీ నౌ సంస్థ ద్వారా 2013 నుంచి ‘ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం సామఫణీంద్ర క్షేత్రస్థాయిలోని సమస్యలకు పరిష్కారాలు చూపే కాకతీయ శాండ్ బాక్స్ అనే ప్రయోగాత్మక ల్యాబ్‌కు పోషకుడు (పాట్రన్)గా వ్యవహరిస్తున్నారు.
Co-founder of @redBus_in and serial entrepreneur @phanindrasama has been appointed as Chief Innovation Officer for Telangana state. Minister @KTRTRS handed over the appointment letter at Secretariat today pic.twitter.com/RcRRBfV2ql
— Min IT, Telangana (@MinIT_Telangana) November 10, 2017