టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద తప్పు చేశాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు నిజంగానే పవన్ తప్పు చేశాడా.. అయితే ఆ తప్పేంటనేగా.. ఇటీవల తమిళ సినీ రాజకీయాల్లో సెన్షేషన్ అవుతూ దేశ రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం రేపిన మెర్సల్ చిత్రాన్ని రీమేక్ చేయక పోవడమే పవన్ చేసిన తప్పంటా..
కోలీవుడ్‌లో దీపావళి కానుకగా రిలీజ్ అయిన మెర్సల్ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 225 కోట్ల భారీ వసూళ్లని సాధించింది. మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అక్కడ తమిళ ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. అదే సినిమాని తెలుగులో అదిరింది అనే డబ్ చేసి వదిలారు. అయితే తెలుగులో ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా.. సెన్సార్ సమస్య వల్ల ఆలస్యంగా రిలీజ్ అయ్యింది .
అయితే ఇదే సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తాడనే వార్తలు కూడా కొద్ది రోజులు ట్రాల్ అయ్యాయి. మెర్సల్ రైట్స్ కోసం అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారని.. మరో నిర్మాత పవన్ కోసం ఆ చిత్రం తెలుగు రీమేక్ హక్కులకోసం ప్రయత్నిస్తున్నారని సినీ వర్గీయుల్లో కూడా చర్చ నడించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు ఒకవేళ పవన్ మెర్సల్ రీమేక్ చేసి ఉంటే ఖచ్చితంగా తెలుగులో అన్ని రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించేది. పొలిటికల్‌గా కూడ చాలా హెల్ప్ అయ్యేదని.. అయితే ఆ అవకాశాన్ని పవన్ చేజేతులా వదులుకున్నాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.