ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని.. దిల్‌రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఎంసీఏ చిత్రంలో నటిస్తున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది టాగ్ లైన్. మొదట ఇది ఒక కాలేజీ లవ్ స్టోరీ అని అనిపించింది. కానీ.. ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా అని ఇటీవలే జరిగిన ఎంసీఏ చిత్రబృందం ఓ కార్యక్రమంలో వెల్లడించింది.
ఇందులో మిడిల్ క్లాస్ మరిది పాత్రలో కనిపించనున్నాడు నాని. నానికి వదినగా భూమిక కనిపించనుంది. వదిన ఆర్టీఓ అధికారిగా పనిచేస్తుందట. అయితే, నాని ఏమో గాలికి తిరుగుతుంటాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికే హైలెట్‌గా నిలుస్తాయని చెబుతోంది చిత్ర బృందం.
ఎంసీఏ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుండగా, దీపావళి శుభాకాంక్షలతో చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. లుంగీలో మన నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. చేతిలో పాల పాకెట్ పట్టుకుని రోడ్డు మీద జోరుగా వచ్చేస్తున్న యువకుడి పాత్రలో కనిపించాడు నాని . ఇక తాజాగా చిత్ర టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్ లో జోష్ పెంచింది చిత్ర యూనిట్ . ఇందులో ఎంసీఏ అంటే ఏంటో క్లుప్తంగా వివరించాడు నాని.