Home / MOVIES / నేను వివాహం చేసుకోబోతున్నది ఇతనే… హీరోయిన్ నమితా క్లారీటి

నేను వివాహం చేసుకోబోతున్నది ఇతనే… హీరోయిన్ నమితా క్లారీటి

అందాల భామగా తమిళంలో ఒకప్పుడు నమితకు ఎంతో క్రేజ్ ఉండేది. కొత్త కథానాయికల రాక ఎక్కువగా ఉండటంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి నమిత .. సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. నిజం చెప్పాలంటే ఈ వార్త అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఈ ప్రచారం పట్ల నమిత తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. “ఆయన వయసేంటి? .. నా వయసేంటి? .. ఇంత సిల్లీగా ఎలా పుకార్లు పుట్టిస్తున్నారు? ఎలా ఈ విధంగా ఆలోచించగలుగుతున్నారు? అంటూ ఆవేదనని వ్యక్తం చేసింది. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టే విధంగా ఓ వీడియో విడుదలైంది. ఈ వీడియోలో నమిత బిగ్ బాస్ స్నేహితురాలు రైజా నమిత త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందని ప్రకటించింది. శరత్ బాబుతో పెళ్లా.. ఆయనెవరు అనే దానిపై తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేశానని నమిత క్లారిటీ ఇచ్చింది.
సీనియర్ నటుడు శరత్ బాబు కూడా నమితతో పెళ్లి వార్తలను ఖండించాడు. ఈ నేపథ్యంలో రైజా ఓ వీడియోను నెట్లో పోస్ట్ చేశారు. అందులో నమితా వీర అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు.. త్వరలో వివాహ తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు.
నమిత కొన్నేళ్లు వీరా ప్రేమలో వున్నట్లు సమాచారం. ఇక త్వరలో దంపతులు కానున్న నమిత-వీరాలకు రైజాతో పాటు స్నేహితులందరూ శుభాకాంక్షలు తెలపడం ఈ వీడియోలో వుంది. ఈ వీడియోను ఓ లుక్కేయండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat