తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రైతు సమన్వయ సమితులు, ఎకరానికి రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్ప కాలిక చర్చ నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం చర్చను ప్రారంభించారు. వీరేశం మాట్లాడిన అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో.. ప్రశ్నోత్తరాల సమయంలో చనకా – కోరటా బ్యారేజీ, సిజేరియన్ శస్త్ర చికిత్స, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డులకు ప్రమాద ఉచిత బీమాతో పాటు పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం ఇచ్చారు.
