చందమామ కాజల్ అగర్వాల్ ఎప్పటికప్పుడు కొత్త సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు పొందినా.. ఈ భామ అంతగా ఎక్స్ పోజింగ్ చేసిన దాఖలాలు తక్కువే. అడపా దడపా మినహాయిస్తే.. అందాల ఆరబోతలో డోస్ పెంచిన ఛాయలు కూడా కనిపించవు. ఐటెమ్ సాంగ్ లో నటించినా సరే.. పరిమితుల్లోనే ఉందంటే కాజల్ హద్దులు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధమవుతుంది.
కానీ రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కోసం.. క్లీవేజ్ అందాలను చూపిస్తూ కాజల్ అగర్వాల్ చేసిన ఫోటో షూట్ వైరల్ అయిపోయింది. కాజల్ ఇంతగా ఎక్స్ పోజింగ్ చేసిందంటే నమ్మలేకపోతున్న ఫ్యాన్స్.. ఇదంతా ఫోటోషాప్ మాయ అంటూ హంగామా చేసేస్తున్నారు. తమ చందమామ ఇలా చేసే పరిస్థితే లేదన్నది వారి వాదన. అయితే.. గతంలో కూడా ఒకట్రెండు సార్లు ఈ డోస్ అందాలను కాజల్ ప్రదర్శించిన సంగతి గుర్తుంచుకోవాలి. మరో మ్యాగజైన్ కోసం ఇలాంటి మోతే మోగించిన కాజల్.. తర్వాత అదంతా ఫోటోషాప్ అనేసింది. దీంతో కోపం వచ్చిన ఆ మ్యాగజైన్ యాజమాన్యం.. ఈ ఫోటోషూట్ కి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేస్తామని అనడంతో సైలెంట్ అయింది.
ఇప్పుడు ఈ ఫోటో షూట్ ని కూడా ఫోటో షాప్ అని కాజల్ అంటుందా లేదా అనే పాయింట్ అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. కానీ గతంలో జరిగిన వివాదం బేస్ చేసుకుని చూస్తే.. ఆ ఛాన్సులు తక్కువే అనిపించక మానదు. ఇంతకీ కాజల్ ఫోటోల్లో నిజమెంత అని ప్రశ్నించుకుంటే.. చందమామ కాదని చెప్పకపోతే మాత్రం.. ఇవి రియల్ ఫోటోస్ అని ఒప్పుకోవాల్సిందే.